Thursday 2 January 2020

కవి ‘వాక్కేళి’ “వాక్కేళి” కవితా సంకలనం

చదవండి చదివించండి

ఎవడి మాతృ భాష వాడికి గొప్పకదా?! కానీ “దేశ భాషలందు తెలుగు లెస్స“ అన్నారుకదా?! అలాంటి తెలుగుభాషలోని గొప్పతనాన్నిగొప్ప గొప్ప పదాల్నితన నైపుణ్యంతో మన తెలుగువాళ్ళ ఆనందం కోసం ఒక ఆట ఆడిస్తూకవివాక్కేళి’ చేసిన ప్రయోగమే  “వాక్కేళి” కవితా సంకలనం!

మచ్చుకి  నాలుగు విన్యాసాలు:

సుబ్బలక్ష్మిగారికేమొ సుప్రభాత డ్యూటి  
అబ్బో  కప్పు కాఫి బాలమురళి తోటి 
అబ్బురంగ టిఫిను పెడుతు ఘంటసాల భేటి
సుబ్బరంగ చెవికి విందు  ముగ్గురి పార్టీ!”
అంటూ ప్రతి తెలుగు ఇంట్లో ప్రతి ఉదయం ఉట్టి పడే తెలుగుతనం గురించి...

ఫటఫటఫటఫట తెగవా నరాలు 
భగభగమండవ ఊపిరితిత్తులు 
సలసలసలసల మరగద నెత్తురు 
కుతకుత ఉడకవ జలసత్తువలు
అంటూ మనం రోజూ మాట్లాడుకునే తెలుగు పదాలనే  ప్రాసలో కూర్చి  ధ్వనితోనే జల్లికట్టుని కళ్ళకి చూపించారు...

పటికబెల్లమాఅన్నమయ్య కీర్తనా?
పచ్చ కర్పూరమాకొండ గాలా?
చిక్కటి నెయ్యాభక్తుల నమ్మికా?
తిరుపతి లడ్డుకి  రుచేడిదయ్యా?”
అన్న ప్రశ్నలు మరే భాషలో వేసినాలడ్డు సంగతేమో గానీఅలాంటి ఆలోచనలే ఇంత తియ్యగా కమ్మగా ఉంటాయాఅనిపిస్తుంది

తెలివిలేదంటాది సదువు రాదంటాది
కల్లల్లొ సూత్తాది గుట్టు బైటెడతాది
పుడమి తిప్పేత్తాది చదలు సూపెడతాది
నాయమ్మి గడుసైంది గుడిసె బడి సేసింది
అని అంటూ తెలుగు భాషలోని వయ్యారాలన్నీ పెంకిపిల్ల ఎంకి రూపంలో ఒలకబోస్తారు మరోచోట!

ఇంకా ఆలీసమెందుకు కొనండి చదవండిఆల్రెడీ చదివేసారాఇంకో రెండు కొని పక్కోడికిచ్చి పండగ చేసుకోమనండి 🤷‍♂️